నందిగామ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ సర్పంచ్ జిల్లెల్ల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో చంద్రయాన్గూడ గ్రామంలో రూ. 10లక్షలు గ్రామ పంచాయతీ నిధులు, రూ. 10లక్షలు ఎస్డీఎఫ్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులను బుధవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో ప్రతి గ్రామంలో పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామం, కంపోస్ట్‌యార్డు, ట్రాక్టర్, ట్రాలీ, మిషన్ భగీరథ నీరు, డ్రైనేజీ, సీసీరోడ్లు వంటి అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని తద్వారా గ్రామాల రూపురేఖలు మారి గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయన్నారు.
రానున్న రోజుల్లో గ్రామాలు, పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మెక్కోండ కుమార్‌గౌడ్, వార్డు సభ్యులు లావణ్య, శ్రీనివాస్‌రెడ్డి, ఈశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపీటీసీలు చంద్రపాల్‌రెడ్డి, కొమ్ముకృష్ణ, కుమారస్వామిగౌడ్, సర్పంచులు అశోక్, జెట్టకుమార్, స్వామి, రమేశ్‌గౌడ్, రాజునాయక్, చేగూర్ పీఏసీఎస్ చైర్మన్ అశోక్, కో-అప్షన్ మెంబర్ బేగ్, నాయకులు బాల్‌రెడ్డి, బీమ్‌రెడ్డి, నర్సింహ, భిక్షపతి, శ్రీకాంత్ పాల్గొన్నారు.