ఆమనగల్లు : యువత, విద్యార్థులు ఆటలపై ఆసక్తి కనబరుచాలని షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కర్ అన్నారు. గురువారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో పోలీసు సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ ముగింపు పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరీరక్షణలో అమరులైన పోలీసుల సేవలను ప్రజలందరూ గుర్తించాలని ఆయన కోరారు. వేడుకలను పురస్కరించుకుని పోలీసు సర్కిల్ ఆవరణలో వాలీబాల్, బ్యాడ్మింటన్ క్రీడాలతో పాటుగా వ్యాసరచన, క్వీజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన శెట్టిపల్లి, ఆమనగల్లు, తలకొండపల్లి జట్లను అభినందించి బహుమతులు ప్రధానం చేశారు.
వాలీబాల్ ప్రథమస్థానం పొందిన శెట్టిపల్లి జట్టుకు రూ. 20వేల నగదు, రన్నరఫ్‌గా ముగిసిన జట్టుకు రూ. 10వేల నగదుతో పాటు షీల్డ్‌ను బహుకరించారు. అంతకుముందు ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని మ్యాచ్‌ను ప్రారంభించారు. అనంతరం పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.