కడ్తాల్, ఆగస్టు 23: మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో సోమ వారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవత మైసమ్మ ఆలయంలో ఉదయం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాన అర్చకుల వేద మం త్రాల మధ్య అమ్మవారికి అభిషేకం, అర్చనలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం గ్రామంలోని ప్రధాన వీధులగుండా మహిళలు బోనాలను ఊరేగించి, అమ్మవారికి నైవెద్యాన్ని సమ ర్పిం చారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ తులసీరాంనాయక్, ఉప సర్పంచ్ రాజారాం, మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్, నాయకులు శ్రీరాములుగౌడ్, యాదగిరిగౌడ్, గణేశ్‌గౌడ్, వెం కటేశ్గౌడ్, మల్లేశ్‌గౌడ్, మహేశ్‌గౌడ్, నర్సింహగౌడ్, సురేందర్‌గౌడ్, శివగౌడ్, విజయ్‌గౌడ్, రాజేశ్‌గౌడ్ పాల్గొన్నారు.