ఇబ్రహీంపట్నంరూరల్ : గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన ఆదిబట్ల పోలీసుస్టేషన్ పరిధిలోని కొంగరకలాన్ సర్వీసురోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. ఆదిబట్ల ఎస్సై సురేష్ కథనం ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని బొంగుళూరు గ్రామానికి చెందిన ఆగయ్య(50) అనే వ్యక్తి వృత్తిరీత్య గాయత్రి కన్స్ట్రక్షన్లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి విధులు ముగించుకుని సర్వీసురోడ్డు వెంబడి ఇంటికి తిరిగి వస్తుండగా కొంగరకలాన్ సమీపంలోని ఔటర్‌రింగ్‌రోడ్డు సర్వీసు రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మెరకు కేసు నమోదు చేసుకుని సీసీకెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.