కొందుర్గు : సమాజంలో స్త్రీల పాత్ర ఎంతో గొప్పదని వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందించి వారు ధృడంగా ఉండే విధంగా చూద్దమని జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం జిల్లెడు దరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో హైదరాబాద్ రామకృష్ణ మఠం వారి ఆధ్వర్యంలో మహిళలకు పోషకాహార కిట్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గృహిణిలు ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంభం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.
మహిళల కోసం పోషకాహార కిట్లు అందిస్తున్న రామకృష్ణ మఠం సభ్యులను ఆయన అభినందించారు. పిల్లల తల్లిదుండ్రులు యుక్త వయస్సు వచ్చిన తరువాత పెళ్లిలు చేస్తే చాల సమస్యలు దూరంగా ఉంటాయని అన్నారు. చిన్న తనంలో పెళ్లిలు చేయడం వలన ముఖ్యంగా మహిళలు చాల బలహీనంగా తయారవుతారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ తీసుకోవాల ని తెలిపారు. బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితిలో ప్రోత్సాహించరాదని పేర్కొన్నారు.