ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చలర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రభు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు డిగ్రీ కళాశాలలో తెలుగు, పోలిటికల్ సైన్స్, హిస్టరీ, కంప్యూటర్సైన్స్, డైరీసైన్స్ సబ్జెక్టుల్లో గెస్ట్ ప్యాకల్టీలో ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 15లోపు కళాశాలలో లేదా (gdcibrahimpatnam@gmail.com) కు దరఖాస్తు పంపించాలన్నారు.
సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 50శాతం మార్కులు కలిగి ఉండాలి. పీఎచ్డీ కలిగిన వారికి ముందు ప్రాధాన్యత, నెట్స్టేట్ కలిగిన వారికి కేవలం పీజీ కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. బోధన అనుభవం కలిగి ఉండాలన్నారు.