
మొయినాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకుల కళాశాల, పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేయడానికి దరఖాస్తులు చేసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా సమన్వయధికారి డాక్టర్ శారద అన్నారు. తెలుగు, హిందీ, ఆంగ్లము, గణితం, సైన్సు, సాంఘిక శాస్త్రంలో సబ్జెక్టులు బోధించడానికి అర్హులైన వారు కావాలని కోరారు. సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురకుల పాఠశాల యందు ఈ నెల 6వ తేదీన 10గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూకు సంబంధిత ధ్రువ పత్రాలతో హాజరు కావాలని కోరారు.
బోధన కోసం నైపుణ్యతను పరిశీలించి ఖాళీలను అనుసరించి అభ్యర్థుల ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంపికైన అనంతరం గురుకుల విద్యా సంస్థల నియమనిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.