మొయినాబాద్ : ఇంధన వనరులను పొదుపుగా వినియోగిస్తే భవిష్యత్ తరాల వారికి ఇబ్బందులు ఉండవని మండల వ్యవసాయ అధికారి ఎన్ రాగమ్మ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్ రెవెన్యూలోని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంధన వనరులు రోజు రోజుకు తరిగిపోతున్న తరుణంలో వాటిని పొదుపుగా వినియోగించాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఇంధనాన్ని విద్యుత్ శక్తిగా మార్చే ప్రక్రియ ద్వారా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారని తెలిపారు.
సహజ సిద్ధంగా లభించే ఇంధన వనరులను మానవాళి అవసరాల నిమిత్తం వినియోగించడంతో రోజు రోజుకు తరిగిపోతున్న పరిస్థితి ఉందన్నారు. కావున విద్యార్థులు ఇంధన వనరులను సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సాయిబాబారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.