ఇంటర్ ఫలితాల్లో.. నాలుగో స్థానంలో రంగారెడ్డి
ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో రంగారెడ్డి జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. ఈమేరకు మంగళవారం నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలే పైచేయి
- రాష్ట్రస్థాయిలో మెరిసిన రంగారెడ్డి
- ఈ సంవత్సరమూ బాలికలదే పైచేయి..
- రంగారెడ్డిలో ఫస్టియర్ 72, ద్వితీయ సంవత్సరం 75
- వికారాబాద్‌లో ఫస్టియర్ 53, ద్వితీయ సంవత్సర 57 శాతం
- ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఫీజు చెల్లించేందుకు జులై 6 వరకు గడువు
- రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఈ నెల 30 నుంచి జులై 6 వరకు
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలికల హవా కొనసాగింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. రంగారెడ్డి జిల్లా రాష్ట్రస్థాయిలోనే నాలుగోస్థానంలో నిలిచింది. జిల్లాలో ఫస్టియర్ పరీక్షలు 56,359 మంది విద్యార్థులు రాయగా.. 41,056 (72శాతం) మంది, సెకండియర్‌లో 52,265 మంది విద్యార్థులకు గాను 39,410 (75 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే వికారాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి 8వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 4,243 (53శాతం) మంది, ద్వితీయ సంవత్సరంలో 7,166 మంది విద్యార్థులకుగాను 4,150 (57శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు ఒకటో తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించగా.. ఈ నెల 30 నుంచి జులై 6వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్ , రీ వెరిఫికేషన్ దరఖాస్తులను సైతం రేపటి నుంచే స్వీకరించనున్నారు.
రంగారెడ్డి, జూన్ 28, (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో రంగారెడ్డి జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. ఈమేరకు మంగళవారం నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 75 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో 56,359 మంది విద్యార్థులకు 41,056 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు-29,634కు 19,956(67 శాతం), బాలికలు-26,725కు 21,100(78 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంత్సరంలో 52,265 మంది విద్యార్థులకు 39,410 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు-28,000లకు 19,703(70 శాతం), బాలికలు-24,265కు 19,707(81 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌కు సంబంధించి ఫస్టియర్‌లో 3327 మంది విద్యార్థులకు 47 శాతంతో 1590 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు-1804కు 569(31 శాతం), బాలికలు-1523కు 1021(67 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 58 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు-1622కు 793 (48 శాతం) , బాలికలు-1127కు 828(73 శాతం) మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు.
ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుంచి 10 వరకు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయించింది. విద్యార్థులు ఈ నెల 30 నుంచి జులై 6 వరకు సంబంధిత కాలేజీల్లో ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30 నుంచి జులై 6 వరకు ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు అవకాశమిచ్చారు. రీ కౌంటింగ్‌కు రూ.100, రీ వెరిఫికేషన్‌కు సంబంధించి ఒక్కో పేపర్‌కు రూ.600 ఫీజును చెల్లించాలని ఇంటర్ బోర్డు వెల్లడించింది.
వోకేషనల్లోనూ బాలికలదే పైచేయి
పరిగి, జూన్ 28 : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల్లో వికారాబాద్ జిల్లాలో బాలికలు టాప్‌లో నిలిచారు. మొదటి సంవత్సరంలో 53, ద్వితీయ సంవత్సరంలో 57శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో 8000 మంది విద్యార్థులకు 4243 మంది(53శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు-3978కి 1654 మంది(41శాతం), బాలికలు-4022కు 2589(64శాతం) ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌లో 1350 మంది విద్యార్థులకు 741(54శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు-508కి 165(32శాతం), బాలికలు-842కు 576 (68శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 7166 మంది విద్యార్థులకు 4150 మంది(57శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు-3501కి 1639(46శాతం), బాలికలు-3665కు 2511(68శాతం) పాసయ్యారు. వొకేషనల్‌లో 915 మంది విద్యార్థులకు 593(64శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు-336కు 153(45శాతం), బాలికలు-579కి 440 మంది(75శాతం) పాసయ్యారు. ద్వితీయ సంవత్సరం ప్రైవేట్ విద్యార్థులు 124 మంది పరీక్షలకు హాజరవగా 16 మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌లో ఏడుగురు పరీక్షలకు హాజరవగా ఐదుగురు పాసయ్యారు. ఫలితాల్లో వికారాబాద్ జిల్లా 32వ స్థానంలో నిలిచింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- district
- position
- Rangareddy
- state
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

