ఇబ్రహీంపట్నం, మార్చి 20: సూర్యాపేట జిల్లాలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజర య్యేందు కు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు తూప్రాన్‌పేట్ సమీపంలో ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది. కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్ తదితర ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్త లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అలాగే, అక్కడి నుంచి సూర్యాపేటలో జరిగిన సమావేశానికి భారీగా తరలివెళ్లారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో ముచ్చటించారు. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కార్యకర్తలు, నాయకుల్లో నూతనోత్తేజం నింపాలని..రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ను ఎగురవేయాలని దిశానిర్దేశం చేశారు. త్వరలో అన్ని జిల్లాలు, మం డలాలు, గ్రామాల్లో నూ తన కమిటీలు వేసుకుని ముందుకు సాగుదామన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలిసిన వారిలో మాజీ ఎంపీపీ కృపేశ్, మండల పార్టీ అధ్యక్షులు బుగ్గరాము లు, రమేశ్, రమేశ్‌గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.