తెలంగాణ ప్రభుత్వం పల్లెపల్లెనా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. క్రీడాకారులకు అన్నిరకాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. క్రీడలపై సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మిగతా రాష్ర్టాల్లో కూడా క్రీడాకారులకు ప్రోత్సాహం దక్కాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనని వారు అభిప్రాయపడుతున్నారు. పల్లెల్లో కూడా యువకులు ఆటలు ఆడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని క్రీడాకారులు తమ మనోగతాన్ని వెల్లడిస్తున్నారు. వివిధ స్థాయిల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు తగిన గౌరవం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని వారు స్పష్టం చేస్తున్నారు. కొన్ని రాష్ర్టాల్లో క్రీడాకారులకు కనీస సౌకర్యాలు లేవని, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే అన్ని వర్గాలకు తెలంగాణ మాదిరిగా సంక్షేమ పథకాలు అందుతాయని ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలు మాత్రమే చేస్తున్న ప్రతిపక్షాల ఆట కట్టించడం కేసీఆర్‌కే సాధ్యమని చెబుతున్నారు.
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు క్రీడారంగ ప్రముఖులు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. ప్రధానంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేలా ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కొనియాడుతున్నారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను ఎనిమిదేండ్ల కాలంలోనే దేశాన్ని సాకుతున్న నాలుగైదు రాష్ర్టాల్లో ఒకటిగా సీఎం కేసీఆర్ నిలిపారన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ర్టానికి బ్రాండ్ అంబాసిడర్‌గా క్రీడాకారిణి సానియామీర్జాను నియమించడం ద్వారా క్రీడలపై తనకు ఉన్న ఆదరణను ఆయన చాటి చెప్పారని, అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించిన వారికి అందజేసే నజరానాలను భారీగా పెంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు. మరోవైపు గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు కృషి చేస్తున్నది. వికారాబాద్ జిల్లాలో 566 గ్రామపంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లోని 97 వార్డుల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నట్లు పలువురు క్రీడాకారులు పేర్కొంటున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. దేశ అభివృద్ధ్దిపై ప్రత్యేకమైన విజన్ ఉన్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే భారతదేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకుంటుందని వారు పేర్కొంటున్నారు.
దేశానికి పేరు తీసుకొస్తారు
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో చిన్నారులు, యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే అన్ని రకాల క్రీడాకారులకు సముచిత స్థానం లభించి దేశానికి పేరు తీసుకొస్తారు.
– ఎం.అనిల్,క్రికెట్ కోచ్, వికారాబాద్
క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం
సీఎం కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పితే దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుంది. భారతదేశం ప్రగతిపథంలో ముందుకు సాగుతుంది. తెలంగాణలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. విద్యావైద్యారంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
-ర్యాకం కృష్ణయ్య, ఫిజికల్ డైరెక్టర్, జడ్పీహెచ్ఎస్, యాలాల
దేశ గతిని మార్చాలి
జాతీయ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆయనతోనే దేశ రాజకీయాల్లో పెను మార్పులు రావడం ఖాయం. తెలంగాణ ప్రగతిని మార్చిన విధంగానే దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు. దేశ వ్యాప్తంగా రైతులు, సబ్బండ వర్గాలకు మంచి రోజులు వస్తాయి. క్రీడాకారులకు కూడా మేలు జరుగుతుంది.
-రాధాకృష్ణ, ఫిజికల్ డైరెక్టర్, పెద్దేముల్ మండలం
క్రీడాకారులకు సముచిత స్థానం ..
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు క్రీడాకారులకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. గతంలో పలు క్రీడల్లో రాణించిన క్రీడాకారులను సీఎం కేసీఆర్ ఘనంగా సన్మానించారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని అయితే అదే ట్రెండ్ కొనసాగుతుంది. తద్వారా క్రీడాకారులు లబ్ధి పొందుతారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వచ్చి భారతదేశ భవితను మార్చాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.
-దానవత్ విశాల్, ముకుందాపూర్, యాలాల మండలం డిస్కస్ త్రోలో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం, జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారుడు
అన్ని విధాలా సీఎం కేసీఆరే సమర్థుడు
అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించారు. బీజేపీ పాలనలో పెరిగిన ధరలతో సామాన్యులంతా చాలా అవస్థలు పడుతున్నారు. దేశాన్ని సరైన బాటలో నడిపించేందుకు ఇప్పుడు జాతీయ స్థాయిలో సమర్థ నాయకుడు లేడు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి కేంద్రంలో కీలక పాత్ర పోషించాలి. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని పథకాలు మన తెలంగాణలో అమలవుతున్నాయి. సీఎం కేసీఆర్ దేశ రాజకీయల్లోకి వస్తే, తెలంగాణ మాదిరిగానే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. ప్రజలు సంతోషంగా ఉంటారు.
-ప్రశాంత్‌రెడ్డి, పీఈటీ, గాజీపూర్ గ్రామం, పెద్దేముల్ మండలం
ప్రధానిని ఢీకొట్టే సత్తా సీఎం కేసీఆర్‌కే ఉన్నది
ప్రస్తుత దేశ రాజకీయాల్లో మార్పులు తప్పనిసరి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలోనూ అమలు కావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చితప్పనిసరిగా పార్టీని పెట్టాల్సిందే. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేస్తారని వివిధ రాష్ర్టాల ప్రజలు నమ్ముతున్నారు. మోదీని ఢీకొట్టే సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉన్నది. వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టి అతి తక్కువ సమయంలోనే తెలంగాణలోని ప్రజల మన్ననలు పొందా రు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే దేశం మొత్తం బాగుపడుతుంది.
-జెట్టిగాళ్ల వెంకటయ్య, స్పోర్ట్స్ పర్సన్ కులకచర్ల
స్వర్ణ భారత్ సాధ్యం
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే స్వర్ణ భారత్ కావడం ఖాయం. కేవలం ఎనిమిదేండ్ల కాలంలోనే అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే భారతదేశం కూడా పురోభివృద్ధి సాధిస్తుంది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, ప్రాజెక్టుల నిర్మాణంతో రైతాంగాన్ని ఉన్నతంగా నిలిపారు. ఇవన్నీ దేశంలోని రైతులందరికీ అందాల్సిన అవసరం ఎం తో ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశమంతా విస్తరించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించే సత్తా కేసీఆర్‌కే ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల వస్తువుల ధరలను పెంచుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను సైతం అమ్ముతూ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సీఎం కేసీఆర్ వంటి నాయకుల అవసరం ఎంతో ఉన్నది.
-చాకలి విష్ణుప్రభాస్, క్రికెటర్, చిన్నమంగళారం, మొయినాబాద్
క్రీడా ప్రాంగణాల ఏర్పాటు అభినందనీయం
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు కృషి చేయడం చాలా సంతోషకరం. గతంలో ఉన్న ప్రభుత్వాలు క్రీడాకారుల అభ్యున్నతికి కృషి చేయలేదు. క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో గ్రామీణులు కూడా వివిధ రకాల పోటీల్లో రాణించేందుకు ఆస్కారం ఉంటుంది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ప్రధాని అయితే అన్ని రంగాల క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది.
-కిరణ్, క్రీడాకారుడు, కొడంగల్
దేశానికే దిక్సూచి సీఎం కేసీఆర్
దేశ ప్రజలు సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు బతకడమే గగనమవుతున్నది. ప్రజలందరూ మోదీ పాలనపై విసుగు చెందారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ముందుకు దూసుకెళ్తున్నది. ఈ తరుణంలో దేశ ప్రజలందరూ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించాలని కోరుకుంటున్నారు.
– పయిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, క్రికెట్ క్రీడాకారుడు , ఇబ్రహీంపట్నం