మంచాల, సెప్టెంబర్ 17: గిరిజనుల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలోని బంజారాహిల్స్లో శనివారం సేవాలాల్ బంజారా నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచాల మండలంలోని వివిధ గిరిజన తండాల నుంచి పెద్దఎత్తున మహిళలు, యువకులు ప్రారంభోత్సవానికి తరలివెళ్లారు. అనంతరం ఎంపీపీ జాటోతు నర్మద, సర్పంచ్ రాజునాయక్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, అధికారులు, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
కడ్తాల్, సెప్టెంబర్ 17 : ముఖ్యమంత్రి కేసీఆర్కు గిరిజనులు అందరం రుణపడి ఉంటారని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. సేవాలాల్ బంజారా, కొమురం భీం ఆదివాసీ ఆత్మగౌరవ భవనాల ప్రారంభోత్సవం కార్యక్రమాలతోపాటు బహిరంగ సభలో పాల్గొనడానికి, శనివారం కడ్తాల్ మండలం నుంచి గిరిజన ప్రజాప్రతినిధులు, నాయకులు తరలివెళ్లారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, వైస్ ఎంపీపీ ఆనంద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, ప్రియానాయక్, రమేశ్నాయక్, మాజీ ఎంపీటీసీ వసంతనాయక్, సర్పంచ్లు తులసీరాంనాయక్, లోకేశ్నాయక్, భారతమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్, ఎంపీడీవో రామకృష్ణానాయక్, ఏపీఏం మధుసూదనచారి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కేశంపేట సెప్టెంబర్ 17: హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఆదివాసీ, గిరిజన సమ్మేళనానికి కేశంపేట మండలంలోని గ్రామాల నుంచి గిరిజనులు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్యాదవ్, ఇన్చార్జి ఎంపీడీవో రవిచంద్రకుమార్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.
ఆదివాసీ, గిరిజన సమ్మేళనానికి తరలిన నేతలు
నందిగామ,సెప్టెంబర్17 : హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన ఆదివాసీ, గిరిజన సమ్మేళనానికి నందిగామ, కొత్తూరు మండలాల నుంచి పలువురు గిరిజన ప్రజాప్రతినిధులు బస్సుల్లో తరలివెళ్లారు. ఈ బస్సు ర్యాలీని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ జెండా ఊపి ప్రారంభించారు. నందిగామ మండల వైస్ ఎంపీపీ మంజూలానాయక్, సర్పంచ్ రాజునాయక్, ఎంపీటీసీ రాజునాయక్, వార్డు సభ్యులు, నాయకులు, ఎంపీడీవో బాల్రెడ్డి, తదితరులు తరలివెళ్లారు.