సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సభ’ కు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరాను న్న నేపథ్యంలో ట్రాఫిక్ పరంగా చర్యలు తీసు కుంటున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. శుక్రవారం ట్రాఫిక్ కంట్రో ల్ రూంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాహనదారులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు శనివారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు ఆయన వివరించారు.
ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకావ డం, కళాకారుల ర్యాలీ ఉండటంతో ఈ రెండు భారీ కార్యక్రమాల నేపథ్యంలో సెంట్రల్ జోన్ పరిధిలో ఉండే వారు ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని తమ కార్యక్రమాలకు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం తర్వాత బయటికి వచ్చి ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోవద్దన్నారు. శనివా రం ఉదయం, సాయంత్రం సమయాల్లో సివిల్స్ కు సంబంధించిన పరీక్ష ఉండటంతో ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వీలైనంత త్వరగా బయలుదేరి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని రంగనాథ్ సూచించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉం డే జంక్షన్ల నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా వెళ్లాలని సూచించారు.
శనివారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గం టల వరకు ఎన్టీఆర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సీఎం కేసీఆర్ సభ ఉన్నందున ఈ సభకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి రానున్నారు. ఈ సభ ప్రారంభం కావడానికి ముందే పీపుల్స్ ప్లాజా నుంచి అంబేదర్ విగ్రహం ఉన్న చౌరస్తా వరకు ఐదు వేల మంది కళాకారులు ర్యాలీని నిర్వ హించనున్నారు. ఈ రెండు కార్యక్రమాలు హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో జరుగనున్నాయి.
ఈ కార్యక్రమాల నేపథ్యంలో సాధారణ ప్రజలు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుం డా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సెంట్రల్ జోన్‌లోని 11 ప్రాంతా ల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించినట్లు వివరించారు. ఆంక్షల సమయాల్లో నెక్లెస్‌రోడ్‌ను పూర్తిగా మూసివేసి, జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా ఇందిరా పార్, నెక్లెస్ రోడ్డు, పబ్లిక్‌గార్డెన్స్, నిజాం కాలేజీలో పారింగ్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పార్కింగ్ స్థలాల నుంచి వేదిక వరకు కాలినడకన రావాలని సూచించారు.
కవాడిగూడ, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, వీఎస్టీ, దోమలగూడ, లిబర్టీ, ఇక్బాల్ మీనార్, ట్యాంక్ బండ్, ఐమ్యాక్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.
అంబేదర్ విగ్రహం, కవాడిగూడ, ఎన్టీఆర్ స్టేడియం, ట్యాంక్ బండ్, లోయర్ ట్యాంక్‌బండ్, లిబర్టీ, నెక్లెస్ రోడ్, అశోక్‌నగర్, ఇందిరాపార్ చౌరస్తాల వైపు వెళ్లొద్దు.
రవీంద్రభారతి, ఇక్బాల్ మీనార్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడ, బషీర్‌బాగ్, రాణిగంజ్, బైబిల్‌హౌస్, కర్బలామైదానం, ఖైరతాబాద్ జంక్షన్, పోలీస్ కంట్రోల్ రూమ్, ఎల్బీ స్టేడియం, వీఎస్టీ, గాంధీనగర్, హిమాయత్‌నగర్, హైదర్‌గూడ, పబ్లిక్ గార్డెన్స్, నిజాం కాలేజీ.. జంక్షన్ల నుంచి వెళ్లకపోవడం మంచిదని పోలీసులు తెలిపారు.