రంగారెడ్డి, సెప్టెంబర్ 14, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సమైక్యతా వజ్రోత్సవాలను తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యేలు, అధికారులతో ఆమె సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మూడురోజులపాటు నిర్వహించే వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలన్నారు. ఈ నెల 16న జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీలు నిర్వహించాలన్నారు. 17న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని, 18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ ప్రాంత ఔన్న త్యాన్ని చాటి చెప్పేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పిలుపు ని చ్చారు. వేడుకల నిర్వహణపై జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి గ్రామీ ణాభివృద్ధి, మెప్మా అధికారులతో మంత్రి సబితాఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వ హించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారంభోత్సవ వేడు కలను అట్టహాసంగా నిర్వహించాలని సూచించారు. దేశా నికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించగా, తెలంగాణ ప్రాంతం మా త్రం 1948 సెప్టెం బర్ 17న రాచరికం పాలన నుంచి ప్రజాస్వామిక పాలన లోకి వచ్చిం దన్నారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామిక పాలనలోకి వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను నిర్వహించేందుకు నిర్ణయిం చిందని మంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేస్తూ విజ యవంతం చేయాలని సూచించారు. వేడుకల్లో భాగంగా ఈనెల 16న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ, భారీ ర్యాలీలు నిర్వహిస్తారని, తదనంతరం బహిరంగ సభలో వజ్రోత్సవాల ప్రాధాన్య తను, తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను వక్తలు వివరిస్తారని మంత్రి వెల్లడిం చారు. అదేవిధంగా ఈనెల 17న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-10లో రూ.53 కోట్ల వ్యయంతో రెండె కరాల్లో తెలంగాణ ప్రభు త్వం నిర్మించిన కొమరం భీమ్ భవనం, సేవాలాల్ బంజారా భవ నాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని, అనంతరం ఎన్టీఆర్ స్టేడి యంలో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని, సీఎం బహిరంగ సభకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఎస్టీలను బస్సుల ద్వారా మండల కేంద్రాల నుంచి తరలించాలని సూచించారు.
అదేవిధంగా ఈనెల 18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని ఆదే శించారు. ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, జిల్లా కలెక్టర్ డి. అమయ్‌కుమార్, అద నపు కలెక్టర్లు తిరుపతిరావు, ప్రతీక్ జైన్, జడ్పీ సీఈవో దిలీప్ కుమార్, డీఆర్డీవో ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రి
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 17న జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జిల్లాలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఈనెల 17న ఉదయం 10.30 గంటలకు కొంగరకలాన్‌లోని కలెక్టరేట్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించనున్నారు.