మంచాల, సెప్టెంబర్ 8 : పేదవాళ్లు ఆత్మగౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ ఆర్హులైన వారందరికీ పింఛన్లను అందజేసి అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని దండేటికార్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై 1540 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో పెద్ద మొత్తంలో పింఛన్లను అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రమేనని తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలను అందజేసి వారికి అండగా నిలుస్తున్నాడని చెప్పారు.
ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో కొత్తగా 10 వేల పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. సంపద సృష్టించే రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్ స్థానంలో నిలిచిందన్నారు. దసరా పండుగ తర్వాత స్థలాలు ఉన్న ప్రతి కుటుబానికీ ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ. 3 లక్షలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో లోవోల్టేజీ సమస్య పరిష్కారం కోసం 23 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అర్హులైన వారికి ఆసరా పింఛన్ రాకపోయి ఉంటే తిరిగి 3 నెలల్లో పింఛన్లు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ నిత్య, వైస్‌ఎంపీపీ రాజేశ్వరి, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, ఎంపీటీసీలు చీరాల రమేశ్, కావలి శ్రీనివాస్, నరేందర్‌రెడ్డి, సుకన్య, జయానంద్, శేఖర్‌రెడ్డి, స ర్పంచ్‌లు జగన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, హరిప్రసాద్, పద్మ, ఎల్లంకి అనిత, లక్ష్మి, జంగయ్య, రా జు, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ అనిత పాల్గొన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఇబ్రహీంపట్నం రూరల్ : సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని దండుమైలారం, నెర్రపల్లి గ్రామాల్లో పింఛన్ లబ్ధిదారులకు గురువారం ఆసరా కార్డులను స్థానిక సర్పంచ్‌లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమంతో పాటు పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రవణమోని మల్లీశ్వరి, భాస్కర్‌గౌడ్, సహకార సంఘం చైర్మన్ బిట్ల వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు అనసూయ, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
పింఛన్ల సంబురం
పెద్దఅంబర్‌పేట : అర్హులైన ప్రతి ఒక్కరూ ఆసరా పింఛన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాటసింగారం రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడు లెక్కల విఠల్‌రెడ్డి అన్నారు. గురువారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని గౌరెల్లి గ్రామంలో కొత్త పింఛన్‌దారులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పింఛన్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అక్బర్ అలీఖాన్, సర్పంచ్ తుడుము మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.