వికారాబాద్, సెప్టెంబర్ 8 : వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడ గ్రామానికి చెందిన సాత్విక్‌రెడ్డి నీట్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ఆల్ ఇండియా లెవెల్లో 264వ ర్యాంక్ సాధించి జిల్లాకు పేరు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సాత్విక్‌రెడ్డి మాట్లాడుతూ నీట్ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో 264వ ర్యాంక్ సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందుకు తల్లిదండ్రుల పాత్ర, ప్రోత్సాహం ఎంతో ఉందని వివరించారు. దీంతో స్నేహితులు, బంధువులు సాత్విక్‌కు అభినందనలు తెలియజేశారు.
సత్తాచాటిన గిరిజన విద్యార్థి
కులకచర్ల, సెప్టెంబర్ 8 : నీట్ 2022 సంవత్సరానికి వెలువడిన ఫలితాల్లో కులకచర్ల మండలం రోకటి గుట్టతండాకు చెందిన పాత్లావత్ శ్రీనిధి మెడిసిన్ విభాగంలో ఆల్ఇండియా జనరల్ విభాగంలో 25457ర్యాంక్ సాధించింది. ఆల్ఇండియా ఎస్టీ క్యాటగిరీలో 93వ ర్యాంకు సాధించింది. శ్రీనిధి తల్లి సరిత దోమ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. శ్రీనిధి పరిగిలోని సాయిరాం కాలనీలో నివాసం ఉంటున్నది. ఆమె చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలనే సంకల్పంతో కష్టపడి చదివి నీట్ లో అత్యుత్తమ ర్యాంక్ సాధించడం గర్వంగా ఉందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనిధికి బోధించిన ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.