నవాబుపేట, సెప్టెంబర్ 4 : ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పల్లెల ప్రగతితో ప్రజల్లో చైతన్యవంతమైన ప్రణాళికలను తీసుకువచ్చింది. మండలంలోని గ్రామాల్లో కమిటీలను ఏర్పాటుచేసి ప్రజలను భాగస్వాములును చేసింది. వర్క్స్ కమిటీ, గ్రీన్ కవర్ కమిటీ అని ఇలా ఒక్కో గ్రామాల్లో బాధ్యతయూతమైన వారితో 4 కమిటీలను ఏర్పాటు చేసి మిగతా వారిని కమిటీ సభ్యులుగా ఎన్నుకుని పల్లెల సమగ్రాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. వీరిలో మహిళలు, పురుషులతో సమానంగా పాల్గొని ఆదర్శ గ్రామాల సరసన నిలువడానికి పోటీపడ్డారు.
నిధుల కేటాయింపు..
జిల్లాకు కేటాయించిన నిధుల నుంచి మండలంలోని గ్రామాలకు విడుదలవుతున్న నిధులతో సంబంధిత శాఖ అధికారులు పనుల్లో వేగం పెంచారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులను ఎమ్మెల్యే యాదయ్య సీఎం కేసీఆర్ సహకారంతో విడుదల చేస్తున్నారు. గ్రామాల్లో అండర్ డ్రైనేజీ సీసీ రోడ్డు, మరుగుదొడ్లు నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి.
ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు
గ్రామ పంచాయతీలకు కనీస మౌలిక సదుపాయల కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. మండల పరిధిలో 32 గ్రామపంచాయతీల్లో వేల కోట్లా రూపాయల బడ్జెట్ను కేటాయించి ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్ల సదుపాయలను కల్పించారు. వీటి ద్వారా మొక్కలకు నీటిని పట్టడం, తడి, పొడి చెత్తను సేకరించి సంపూర్ణ పారిశుధ్యానికి కృషి చేస్తున్నారు.
గ్రామాల్లో మొక్కల సంరక్షణ
ప్రభుత్వ నిర్ణయంతో గ్రామాల్లో చిట్టడవిని తలపించేలా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. హరితహార కార్యక్రమంలో మండల పరిధిలోని గ్రామాల్లో మొత్తం 46,3010 మొక్కలను పెంచి గ్రామాలకు పంపిణీ చేశారు. మొక్కలు నాట్టడమే కాదు.. వాటికి ట్రీగార్డులను ఏర్పాటుచేసి నీటిని పోస్తూ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
రైతు వేదికలు
రైతుల సమగ్ర అభివృద్ధికి వేదికలుగా ప్రతి గ్రామంలోనూ రైతువేదికలను ప్రభుత్వం నిర్మించింది. రైతులు ఏ సీజన్లో, ఏయే భూముల్లో ఏ పంటలు వేయాలి, విత్తనాలు, ఎరువులు, సస్య రక్షణ చర్యలు ఏంటి..? రైతులు పండించిన పంటలకు డిమాండ్ ఎక్కడా ఎలా ఉంది వంటి విషయాలను రైతులే ఒకచోట కూర్చుని చర్చించుకునే విధంగా ఏర్పాటైన రైతు వేదికలు ఇప్పుడు రైతులకు శిక్షణా కేంద్రాలుగా మారుతున్నాయి.
డంపింగ్ యార్డులు
ప్రతి గ్రామంలో చెత్త సేకరించి డంపింగ్యార్డులకు తరలించడం, చెత్తను వేరుచేసే షెడ్లు ఏర్పాటయ్యాయి. పైగా ఈ డంపింగ్ యార్డుల్లో కంపోస్టు ఎరువును తయారుచేసుకొని పంచాయతీకి మంచి ఆదాయం సాధిస్తున్నారు.
నర్సరీలు
మండలంలో పరిధిలోని ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటుచేసి ఆ గ్రామానికి సరిపోను మొక్కలు నాటి ఇతర గ్రామాలకు అందించే విధంగా ప్రభుత్వం నిధులను ఖర్చుచేస్తుంది. దీంతో గ్రామాలు పచ్చని వనంలా కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా పచ్చదనాన్ని పెంచడం కోసమే నర్సరీలను ఏర్పాటుచేసి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
శ్మశాసనవాటికలు
పేదవాడికి ఎక్కడ అంత్యక్రియలు చేయాలో తెలియని అయోమయం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి గ్రామానికి ఒక శ్మశాసన వాటికను నిర్మించి గ్రామస్తులందరి సమస్యను తీర్చింది. దీనికి తోడు అక్కడే సౌకర్యవంతంగా ఉండేందుకు స్నానపు గదులను కూడా నిర్మించింది.
అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
32 గ్రామపంచాయతీల్లో కొన్ని అనివార్య కారణాల వలన గంగ్యాడ, యెల్లకొండ గ్రామాలు తప్ప ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్డు పనులు పూరైనవి. వాటికి కూడా నిధులు మంజూరు చేశాం. నిధులు విడుదల కాగానే సీసీ రోడ్డు నిర్మాణాపు పనులు ఆయా గ్రామాల సర్పంచులు ప్రారంభిస్తారు. అండర్డ్రైనేజీ, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన పూరైనవి. గ్రామాల అసరాల నిమిత్తం ఎప్పటికప్పుడు సర్పంచులు, సెక్రటరీలను అభివృద్ధి పనులపై ఆరా తీస్తూనే ఉంటా. – ఎమ్మెల్యే యాదయ్య