మాడ్గులు, సెప్టెంబర్ 3 : కు.ని ఆపరేషన్ అనంతరం పరిస్థితి విషమించి మృతి చెందిన మమత, మౌనికల కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం నర్సాయపల్లి గ్రామానికి చెందిన మమత, కొల్కులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్‌నగర్ తండాకు చెందిన మౌనిక కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందజేవారు. మమత, మౌనిక పిల్లల చదువులకు పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ప్రభుత్వ పరంగా డబల్ బెడ్రూం ఇల్లు నిర్మిస్తామని తెలిపారు. బాధ్యులైన వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం రూ. 5 లక్షలు అందజేసిందన్నారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జడ్పీ వైస్ చైర్మ్న్ బాలాజీ సింగ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు సూదిని కొండల్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, సర్పంచ్ శ్రీకాంత్, నిరంజన్‌గౌడ్, మిద్దె రాములు, సాయిరెడ్డి, విష్ణు, శ్రీనువాస్, చిలుక జంగయ్య, పల్లె జంగయ్య పాల్గొన్నారు.
పేదలకు సహాయనిధి వరం లాంటిదని ఎమ్మెల్సీ నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల మండలానికి చెందిన నల్లచెరువు గ్రామ వాసి కట్ట విజేందర్కు రూ. 34వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఆ చెక్కును ఎమ్మెల్సీ అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మ న్ బాలాజీ సింగ్, కొండల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జంగ య్య, రాములు, సాయిరెడ్డి, జంగయ్య పాల్గొన్నారు.