చేవెళ్లటౌన్, సెప్టెంబర్ 3: సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందజలో ఉందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల గ్రామంలో నూతనంగా మంజూరైన 136 ఆసరా పంఛన్కార్డులను లబ్ధిదారులకు శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులందరికీ ఆసరా పింఛన్లు మంజూరవుతాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల పేద ప్రజల కుటుంబానికి ఏదో ఒక పథకం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేస్తున్నారని తెలిపారు.
ఒంటరి మహిళలకు సైతం తెలంగాణ ప్రభుత్వం పింఛన్లు ఇచ్చి వారికి అండగా నిలుస్తుందన్నారు. ఎవరైనా అర్హులు ఉంటే ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని తెలిపారు. అలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, సర్పంచ్ బండారి శైలజ, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో రాజ్‌కుమార్, మండల పంచాయతీ అధికారి విఠలేశ్వర్, ఉప సర్పంచ్ గంగి యాదయ్య, ఎంపీటీసీ రాములు, వార్డు సభ్యులు మల్లారెడ్డి, మల్లేశ్, కార్యదర్శి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
చేవెళ్ల గ్రామానికి చెందిన మంగళి విజయ్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. విజయ్ మృతదేహంపై పూలమాలేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, నాయకులు అబ్ధుల్ ఘని, నర్సిములు, చింటు , కృష్ణ ఉన్నారు.