పరిగి, సెప్టెంబర్ 3 : ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. శనివారం పరిగి మండలం తొండపల్లి, రాపోల్, జాఫర్‌పల్లి, కాళ్లాపూర్, సయ్యద్‌మల్కాపూర్, మాదారం గ్రామాల్లోని లబ్ధిదారులకు కొత్త పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఒకటిరెండు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఈసారి కొత్తగా 10లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసి ఆ కుటుంబాలకు సర్కారు అండగా నిలిచిందన్నారు.
రూ.200 ఉన్న పింఛన్‌ను వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోధకాలు వ్యాధిగ్రస్తులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రైతుబంధు కింద ప్రతి గ్రామంలో గుంటభూమి ఉన్న రైతులకు సైతం పెట్టుబడి సాయం, ఏ కారణంగా రైతు చనిపోయినా రైతుబీమా కింద రూ.5లక్షలు అందుతున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, ఎంపీడీవో శేషగిరిశర్మ, ఎంపీటీసీ బి.ఉమాదేవి, సర్పంచ్‌లు బి.రాములు, కె.జంగయ్య, వెంకట్రాంక్రిష్ణారెడ్డి, జగన్, ఎం.గీత, బి.అనిత, సయ్యద్ ఫాహి సుల్తానా, పీఏసీఎస్ డైరెక్టర్ హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.
పరిగి పట్టణంలోని బ్రాహ్మణవాడలో కొలువుదీరిన వినాయకుడికి శనివారం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీపీ కె.అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, కౌన్సిలర్లు కృష్ణ, నాగేశ్వర్రావు, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంతోశ్ పాల్గొన్నారు.