కడ్తాల్, ఆగస్టు 29 : పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మట్టి గణపతికి పూజలు నిర్వహించాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సోమవారం కడ్తాల్‌లో గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా సమకూర్చిన మట్టి వినాయక ప్రతిమలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రసాయన ప్రతిమల నిమజ్జనంతో నీరంతా కలుషితమవుతుందని పేర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాలుగా కడ్తాల్ మండలంలో మట్టి వినాయకులను అందజేస్తున్న వెంకటేశ్గుప్తాను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం 600 మట్టి విగ్రహాలను ప్రజలకు అందజేశారు.
నిరుపేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా
నిరుపేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. సోమవారం కడ్తాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కడ్తాల్‌కు చెందిన మల్లయ్యకు రూ.60వేలు, రావిచేడ్‌కు చెందిన సబితకు రూ.60వేలు, మక్తమాదారానికి చెందిన దివ్యకు రూ.13,500, గోవిందాయిపల్లికి చెందిన రాణికి రూ.16వేలు, వాసుదేవ్పూర్కు చెందిన రజితకు రూ.60వేలు, చల్లంపల్లికి చెందిన మాధవరెడ్డికి రూ.24వేలు, కృష్ణకు రూ.14వేలు, వంపుగూడెంకు చెందిన ప్రశాంత్‌కు రూ.16వేలు, ఆమనగల్లుకు చెందిన నీలమ్మకు రూ.14వేలు, వెంకటాపూర్ కు చెందిన విజయకు రూ.20వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి.
సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరంలా మారిందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, రైతు బంధు సమితి మండల, గ్రామాధ్యక్షులు వీరయ్య, నారాయణ, నర్సింహ, మండల మహిళా అధ్యక్షురాలు వాణిశ్రీ, సర్పంచ్‌లు కృష్ణయ్యయాదవ్, హరిచంద్‌నాయక్, సులోచన, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, ఏఎంసీ డైరెక్టర్లు లాయక్‌అలీ, రమేశ్, నాయకులు మహేశ్, రాంచంద్రయ్య, చెన్నయ్య, బాలకృష్ణ, సుమన్, ఇర్షాద్, శ్రీకాంత్, వాసుదేవులు, రామకృష్ణ, వీరేంద్రగుప్తా ఉన్నారు.
పేదలకు వరం సీఎం సహాయనిధి
మాడ్గుల, ఆగస్టు 29 : పేదలకు సీఎం సహాయనిధి వరంలాంటిదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మాడ్గుల మండలానికి చెందిన సుద్దపల్లి గ్రామ వాసికి రూ.18500, అంజమ్మకు రూ.2లక్షల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. బాధితులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శివకుమార్‌గౌడ్, ఎంపీటీసీ వెంకటయ్య ఉన్నారు.