వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్, మార్చి 14: శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహకల్పలో ఉదయం 4 నుంచి 7 గం టల వరకు 105 మంది పోలీసులతో 800 ఇండ్లల్లో తనిఖీలు చేశారు. అందులో అనుమతి లేని వాహనాలు 81, గుట్కా, పొగాకు, కత్తులను స్వాధీనం చేసుకున్నా రు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా పని చేస్తున్నదన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఇంటి పరిసరాల్లో సంచరిస్తే 100 డయల్, పోలీసుకు సమాచారం ఇవ్వాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. వారం రోజుల్లో సరైన ధ్రువపత్రాలను చూపించి వాహనాలను తీసుకెళ్లొచ్చన్నారు. గుట్కా, మత్తు పదార్థాలను రవాణా చేస్తు న్న వారిపై కేసులు నమోదు చేసి రూ.లక్ష విలువ గల సిగరెట్లు, రూ.26 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లు, 16 బస్తాల పీడీఎస్ బియ్యం, ఆటో ట్రాలీని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ సెర్చ్‌లో డీఎస్పీ, ఆరుగురు సీఐలు, పదిమంది ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు రాజశేఖర్, ప్రమీల, తిరుపతిరాజు, దాసు, ఎస్ఐలు సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.