కడ్తాల్, ఆగస్టు 28 : అభివృద్ధిని ఓర్వలేకపోతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గుణపాఠం తప్పదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన రాంచందర్‌కు రూ.1,50,000లు, నాగయ్యకు రూ.26 వేలు, తలకొండపల్లి మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన అలివేలుకు రూ.60 వేలు, మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామానికి చెందిన విఠల్‌రెడ్డికి రూ.49 వేలు, వెల్దండ మండల కేంద్రానికి చెందిన యాదమ్మకు రూ.50 వేలు, కోట్రా గ్రామానికి చెందిన ధనమ్మకు రూ.23,500, కల్వకుర్తి పట్టణానికి చెందిన తిరుపతమ్మకు రూ.లక్ష, నరేందర్‌కు రూ.60 వేలు, తరుణ్‌కు రూ.32 వేలు, బాలరాజ్‌కు రూ.48 వేలు, మజీద్ఖాన్కు రూ.40 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరయ్యాయి.
ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్సీ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదల ఇండ్లల్లో వెలుగులు నింపుతున్నదన్నారు. సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరంలా మారిందని, ఈ పథకంతో పేదలకు కార్పొరేట్ దవాఖానల్లో అత్యుత్తమ వైద్యం అందుతున్నదని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుపెట్టడానికి ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్న పార్టీలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం
నందిగామ : సీఎం సహాయనిధి పథకం ద్వారా నిరుపేదలు సైతం కార్పొరేట్ స్థ్ధాయి వైద్యాన్ని పొందుతున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్, ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, నాయకులు దేవేందర్‌యాదవ్, పెంటనోల్ల యాదగిరి, కడల శ్రీశైలం, రమేశ్, రషీద్, శ్రీరాములు, పాండు పాల్గొన్నారు.