కొడంగల్/బొంరాస్‌పేట, ఆగస్టు 25 : రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్ పట్టణంలోని కేఎస్వీ ఫంక్షన్ హాల్లో.. అలాగే బొంరాస్‌పేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులు, మంజూరు పత్రాలను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి ఫొటోలు దిగి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును 65 ఏండ్ల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి ఆసరా పింఛన్లు అందజేస్తామని 2018 ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారని, కరోనా కారణంగా కొంత ఆలస్యమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హత వయసును తగ్గించి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. పింఛన్లు రానివారు నిరాశచెందొద్దని అర్హులందరికీ మంజూరు చేస్తామని, రానివారు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.కొడంగల్ మండలంలో గతంలో 4,249మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతుండే వారని, కొత్తగా 943 మందికి లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొడంగల్ మండల పరిధిలో మొత్తంగా 5200ల వరకు లబ్ధిదారులు పింఛన్లు అందుకుంటున్నారని, ప్రతి నెలా రూ.కోటి ఆసరా పింఛన్లను లబ్ధిదారులు అందుకొంటున్నట్లు తెలిపారు.
అలాగే ఒక్క బొంరాస్‌పేట మండలంలోనే 10 వేల మంది లబ్ధిదారులకు ప్రతినెలా రూ.1.50 కోట్లు పింఛన్లు రూపంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదన్నారు. మహిళలు, రైతులు, ఉద్యోగులు, యువకులు ఇలా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. పక్కనే ఉన్న బీజేపీ పాలిత కర్నాటక రాష్ట్రంలో ఇలాంటి పథకాలు అమలులో లేవఅన్నారు. కొడంగల్‌లో ఎమ్మెల్యే సమక్షంలో లబ్ధిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కొడంగల్‌లో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, సర్పం చ్ల సంఘం అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బస్వరాజ్, సర్పంచ్‌లు సయ్యద్ అంజద్, వెంకట్‌రెడ్డి,గుండప్ప, శంకర్‌నాయక్, బాల్‌రెడ్డిలతో పాటు టీఆర్ఎస్ నాయకులు సిద్ధిలింగప్ప, సాయిలు, ఫయూం, పార్టీ మండల మాజీ అధ్య క్షుడు గోడల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బొంరాస్‌పేటలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, తాలూకా అధికార ప్రతినిధి టీటీ రాములు, తాలూకా, మండల యూత్ అధ్యక్షుడు నరేశ్‌గౌడ్, మహేందర్, పార్టీ నాయకులు రమణారెడ్డి, బాబర్, రామకృష్ణయాదవ్, బండశీను, అన్నూబాయి, బసిరెడ్డి, రవిగౌడ్, తోలు వెంకటయ్య, సలాం, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.