కడ్తాల్, ఆగస్టు 25 : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. గురువారం కడ్తా ల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పుట్టినరోజు వేడుకలను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల్, తలకొండపల్లి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కల్వకుర్తిని అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెడతానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు దశరథ్‌నాయక్, విజితారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, రైతుబంధు సమితి మండల, గ్రామ అధ్యక్షులు వీరయ్య, నర్సింహ, సర్పంచ్‌లు రవీందర్‌రెడ్డి, కృష్ణయ్యయాదవ్, తులసీరాంనాయక్, హరిచంద్‌నాయక్, భాగ్యమ్మ, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాం, మంజుల, ఏఎంసీ డైరెక్టర్ లాయక్‌అలీ పాల్గొన్నారు.
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలో ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.