షాబాద్, ఆగస్టు 25: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని కొంగరకలాన్‌లో జరిగిన సీఎం కేసీఆర్ సభకు జడ్పీటీసీ ఆధ్వర్యంలో 200 వాహనాల్లో టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. వాహనాల ర్యాలీని ఎమ్మెల్యే యాదయ్య, జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్కు తప్ప ఇతర పార్టీలకు భవిష్యత్ లేదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా రూ. కోట్లు ఖర్చు చేసి భవనాలను నిర్మించడం సంతోషకరమని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు గూడూరు నర్సింగ్‌రావు, శ్రీరాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్న, డైరెక్టర్ సూద యాదయ్య, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ మద్దూరు మల్లేశ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్‌రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ చాంద్‌పాషా పాల్గొన్నారు.
మొయినాబాద్ : బహిరంగ సభకు మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. 28 గ్రామ పంచాయతీల నుంచి టీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజాప్రతినిధులు వెళ్లారు. మహిళలు సైతం పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
మంచాల : వివిధ గ్రామాల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు , నాయకులు భారీగా తరలివెళ్లారు. ప్రధాన చౌర స్తా నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. బాణా సంచా కాల్చారు.
కడ్తాల్ : మండలం నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల నుంచి పలు వాహనాల్లో టీఆర్ఎస్ నాయకులు సభకు బయల్దేరారు. జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, రవీందర్‌రెడ్డి, తులసీరాంనాయక్, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, వీరయ్య, నర్సింహ, లాయక్‌అలీ పాల్గొన్నారు.
ఆమనగల్లు : కొంగరకలాన్‌లో రంగారెడ్డి జిల్లాసమీకృత కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలివెళ్లారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, వైస్ ఎంపీపీ అనంత రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్ రావు, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్, ఎంపీటీసీ కుమార్, సరిత పాల్గొన్నారు.
కేసీఆర్ సభకు తరలిన నాయకులు
మాడ్గుల : మండలంలోని వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు తరలి వెళ్లారు. జై కేసీఆర్ జై జై కేసీఆర్ అని నినదించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ రాజవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
శంకర్పల్లి : మున్సిపాలిటీ, మండల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, చైర్పర్సన్ విజయలక్ష్మి, రవీందర్‌గౌడ్, వెంకట్రాంరెడ్డి, శ్రీనాథ్‌గౌడ్, వాసుదేవ్‌కన్నా, గోపాల్ పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని జడ్పీటీసీ మాలతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ అన్నారు. కొంగర కలాన్‌లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు చేవెళ్ల మండలం నుంచి అధిక సంఖ్యలో వెళ్లారు. వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శివారెడ్డి, మాజీ సర్పంచ్ జంగారెడ్డి, నాయకులు నాగార్జున రెడ్డి, యాదయ్య, రమణారెడ్డి, కృష్ణా రెడ్డి, దయాకర్, మహేశ్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
యాచారం : మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన డ్వాక్రా మహిళల కోసం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయగా, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు క్రూజర్లు, కార్లలో తరలి వెళ్లారు. జై తెంగాణ, జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జడ్పీటీసీ జంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు రాజు, బిలకంటి చంద్రశేఖర్‌రెడ్డి, చిన్నోళ్ల యాదయ్య, ఖాజు, కల్లూరి శివ, తలారి మల్లేశ్ హాజరయ్యారు.
పెద్దఅంబర్‌పేట : కొంగరకలాన్‌లో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు మున్సిపాలిటీ నుంచి టీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివెళ్లారు. టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు సిద్దెంకి క్రిష్ణారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి పాశం దామోదర్ ఆధ్వర్యంలో నాయకులు, ప్రజలు సభకు బయలుదేరారు. సభకు వెళ్లినవారిలో కౌన్సిలర్లు హరిశంకర్, పరశురాం నాయక్, పాశం అర్చన, రేణుక, చిరంజీవి, బల్రాం, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
అబ్ధుల్లాపూర్‌మెట్టు : కొంగరకలాన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు అబ్దుల్లాపూర్‌మెట్ సర్పంచ్ చెరుకు కిరణ్ ఆధ్వర్యంలో జేఎన్‌ఎన్‌ఆర్‌యూఎం కాలనీ నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆరు బస్సు ల్లో తరలివెళ్లారు. కార్యక్రమంలో బాటసింగారం మార్కెట్ కమిటీ చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్, వార్డు సభ్యుడు మొగుళ్ల జీవన్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఎండీ నసీరుద్దీన్, మందుగుల దుర్గాసతీగౌడ్, నాయకులు రవీందర్, శ్రీను, వేణు తదితరులు పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా కార్యకర్తలు సభకు కదిలారు.