కడ్తాల్, ఆగస్టు 25 : సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల్ గ్రామానికి చెందిన బాలయ్యకు రూ.లక్ష, కల్వకుర్తి పట్టణానికి చెందిన ప్రణీత్‌కుమార్‌కు రూ.29,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. గురువారం మధ్యాహ్నం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతో మంది పేదల ఇండ్లలో వెలుగులు నింపుతున్నదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం గాన్గుమార్ల తండా గ్రామ పంచాయతీలో మృతి చెందిన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహంపై పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు భాస్కర్‌రెడ్డి, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, కేఎన్ఆర్ యువసేన జిల్లా అధ్యక్షుడు నరేశ్‌నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, నాయకులు జహంగీర్‌అలీ, ప్రభులింగం, జంగయ్య, రంగయ్య, రవికుమార్, రాంచంద్రయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : ఆమనగల్లు మాజీ వార్డు సభ్యుడు జంతుక అల్లాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తరఫున సీఎంఆర్ఎఫ్ చె క్కు అందజేశాడు. ఫరూఖ్‌నగర్ గ్రామానికి చెందిన జహం గీర్బీ కి రూ. 16 వేల చెక్కు మంజూరైంంది. కార్యక్ర మంలో మెకానిక్ బాబా, విజయ్ రాథోడ్ పాల్గొన్నారు