ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్ట్టు 23 : సీఎం కేసీఆర్ గురువారం జిల్లాలో పర్యటిస్తారని, సీఎం సభ కోసం పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఎలిమినేడు వ్యవసాయక్షేత్రంలో నియోజకవర్గస్థాయి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లు, పార్టీ మండలం, మున్సిపాలిటీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని కొంగరకలాన్ సమీపంలో నిర్మించిన నూతన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. ఇక నుంచి జిల్లా ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి పరిష్కరించుకోవడానికి సులువుగా ఉంటుందన్నారు. గురువారం ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున కదలాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆకుల యాదగిరి, కోరె కళమ్మ, పార్టీ మండల అధ్యక్షులు చిలుకల బుగ్గరాములు, కొత్త కిషన్‌గౌడ్, చీరాల రమేశ్, రమేశ్‌గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు అమరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కొప్పు జంగయ్యతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
పెద్ద ఎత్తున కదలాలి
ఇబ్రహీంపట్నం రూరల్ : బహిరంగ సభకు పెద్ద ఎత్తున కదలాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఆయన మాట్లాడుతూ రైతు సమస్యలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయ నిర్మాణంతో రైతులకు కూడా ఇబ్బందులు తొలగిపోనున్నాయని తెలిపారు.
సభను విజయవంతం చేయండి
మంచాల : సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున హాజరవ్వాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ అన్నారు. మండలం నుంచి ఐదు వేల మందిని తరలించడానికి ఏర్పాట్లు చేశామన్నారు.
యాచారం : బహిరంగ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్ అన్నా రు. అన్ని గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవ్వాలన్నారు.