ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహస్రచండీయాగం సోమవారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖమంత్రి సబితారెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఇతర ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. చివరి రోజు కావడంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు.
-ఇబ్రహీంపట్నం, ఆగస్టు22
ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 22 : ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన సహస్ర చండీయాగం సోమవారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలోని ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌చారి, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఐదు రోజుల పాటు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎలిమినేడులో నిర్వహించిన సహస్ర చండీయాగంతోపాటు ప్రతిరోజూ పద్మావతీ వేంకటేశ్వరస్వామి, పార్వతీపరమేశ్వర్లు, లక్ష్మీనర్సింహస్వామి, సీతారాముల కల్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని హోమాన్ని తిలకించారు. పలు ఆలయాలకు చెందిన వేదబ్రాహ్మణులతో ఈ యాగానికి సంబంధించిన తంతును నిర్వహించారు.
చివరిరోజు యాగం పూర్తవడంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దంపతులు, ఆయన కుమారుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి దంపతులు బ్రాహ్మణులను ఘనంగా సన్మానించారు. యాగంలో సుమారు లక్ష మంది వరకు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుతూ చేపట్టిన సహస్ర చండీయాగం విజయవంతం కావడంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలిపారు. యాగం విజయవంతం కావడానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, యువత, పోలీసులకు కూడా అభినందనలు తెలిపారు.
అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు
సహస్ర చండీయాగం చివరి రోజైన సోమవారం ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని తిలకించడానికి ఉదయం నుంచే హోమం నిర్వహించిన ప్రదేశానికి చేరుకున్నారు. పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టే సమయానికి ఎమ్మెల్సీ కవిత, మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. పూర్ణాహుతిలో భాగంగా యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అనంతరం బ్రాహ్మణుల భక్తి ప్రవచనాలను ప్రజలు విని తరించారు.
హాజరైన ప్రముఖులు
చివరి రోజు సహస్ర చండీయాగం కార్యక్రమానికి రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, పార్టీ మున్సిపాలిటీల అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, జంగయ్య, అమరేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు రమేశ్‌గౌడ్, రమేశ్, బుగ్గ రాములు, టీఆర్ఎస్ నాయకులు జగదీశ్, జగన్, మల్లేశ్, చంద్రప్రకాశ్, జెర్కోని రాజు, రాజ్‌కుమార్, విజయ్‌కుమార్, శేఖర్, చిన్న, శ్రీనివాస్‌రెడ్డి, నరేశ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.