బొంరాస్పేట, ఆగస్టు 21: కిశోర బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ప్రతినెలా పోషకాహారాన్ని అందిసున్నది. అయితే ఈ పథకాలు బాగానే పనిచేస్తున్నా.. బడి మానేసిన కిశోర బాలికలకు ఈ పథకాల ప్రయోజనాలు అందడంలేదు. దీంతో వారు సరైన పోషకాహారం అందక రక్తహీనతతో ఎదుగుదల లోపించి తరచూ రోగాల బారిన పడుతుంటారు.
వారిలో పోషకాహార లోపాన్ని నివారించి ఆర్యోవంతులుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సాగ్ (స్కీం ఫర్ అడొలెసెంట్ గర్ల్స్) అనే పథకాన్ని అమ లు చేస్తున్నది. 11 నుంచి 14 ఏండ్ల లోపు ఉన్న బడి మానేసిన బాలికలకు పోషకాహారాన్ని అందించనున్నారు. వికారాబాద్ జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 388 మంది కిశోర బాలికలను ఈ పథకానికి అర్హులుగా మహిళా, శిశు సంక్షే మ శాఖల అధికారులు గుర్తించారు. వీరికోసం ప్రభుత్వం వివిధ రకాల పోషకాహార పదార్థాలతో తయారు చేసిన పోషకాహార కిట్లను ఇప్పటికే జిల్లాలకు పంపిణీ చేసింది. ఈ కిట్లలోని ఆహార పదార్థా లు వంద రోజులకు సరిపోతాయి. వీటిని త్వరలో నే జిల్లాలోని అర్హులుగా గుర్తించిన బాలికలకు పంపిణీ చేయనున్నారు.
కిట్లలోని పోషకాహార పదార్థాలు
కిశోర బాలికలకు పంపిణీ చేసే పోషకాహార కిట్లలో గోధుమలు 10 కిలోలు, 500 గ్రాముల నెయ్యి ప్యాకెట్, కిలో ఖర్జూరం, 750 గ్రాముల ప్రోటీన్ బి స్కెట్లు, ఇనుము, 800 మిల్లీలీటర్ల జింక్ టానిక్, 90 క్యాల్షియం, విటమిన్ మాత్రలుంటాయి.
త్వరలో కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేస్తాం..
బడి మానేసిన కిశోర బాలికల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాగ్ పథకాన్ని అమలు చేస్తున్నది. ప్రభుత్వం వివిధ రకాల పోషకాహార పదార్థాలతో తయారు చేసిన పోషకాహార కిట్లను జిల్లాలకు ఇప్పటికే పంపిణీ చేసింది. జిల్లాలో 388 మంది కిశోర బాలికలను ఈ పథకం కింద అర్హులుగా గుర్తించాం. త్వరలో కలెక్టర్ చేతుల మీదుగా ఆ కిట్లను పంపిణీని ప్రారంభిస్తాం.
-లలితకుమారి, వికారాబాద్ జిల్లా సంక్షేమ అధికారి