వికారాబాద్ ఆగస్టు 19: నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధితో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని బంట్వారం మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రూ.11,31,100లను చెక్కుల రూపంలో లబ్ధిదా రులకు అందజేశారు కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సి లర్ పుష్పలతారెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కోట్‌పల్లి, ఆగస్టు 19: పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. గత ఏడాది వాగులో బైక్ మీద నుంచి పడి తీవ్ర గా యాలై దవాఖానలో చికిత్స పొందిన మల్శైల్పల్లి తండాకు చెందిన కేస్లీబాయ్కి సీఎం రిలీఫ్‌ఫండ్ కింద వచ్చిన రూ. 60 వేల చెక్కును శుక్రవారం హైదరాబాద్‌లో ఆమె భర్తకు అందించారు.