రంగారెడ్డి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నది. కాగా స్వా తంత్య్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ పోరాడిన విధానం విద్యార్థులకు తెలిసేలా నేటి నుంచి గాంధీ సినిమాలను ప్రదర్శించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు గాంధీ సినిమాలను వీక్షించేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ పూ ర్తి చేసింది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవే ట్ థియేటర్ల నిర్వాహకులతో ఇప్పటికే చర్చించిన జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. దీంతో నేటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు రోజుకొక షో చొప్పున స్పెషల్ షోలను ప్రదర్శించనున్నారు. కాగా ఏ తేదీన ఏ స్కూల్కు చెంది న విద్యార్థులు థియేటర్లకు వెళ్లాలనే సమాచారాన్ని కూడా ఇప్పటికే ఆయా పాఠశాలల నిర్వాహకులకు అధికారులు అందించారు. మరోవైపు విద్యార్థులను పాఠశాలల నుంచి సినిమా థియేటర్లకు తీసుకెళ్లేందుకు ఇబ్బందులు కలుగకుం డా ఉండేందుకు ప్రత్యేకంగా బస్సులను కూడా జిల్లా యంత్రాంగమే ఏర్పాటు చేసింది.
జిల్లావ్యాప్తంగా 80 స్క్రీన్లు…
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆరు నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు జాతిపిత మహాత్మాగాంధీ గురించి తెలిసేలా నేటి నుంచి సినిమాలను ప్రదర్శించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 1,826 స్కూళ్లుండగా..వీటిలో 533 ప్రభుత్వ బడులున్నాయి. కాగా ఆరు నుంచి పదోతరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన మొత్తం విద్యార్థు లు 3,22,746 మంది ఉన్నారు. రోజుకు 31,249 మంది విద్యార్థుల చొప్పున గాంధీ సినిమా వీక్షించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఎంపిక చేసిన ఆయా థియేటర్లలో రోజుకొక షో ప్రత్యేకంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రదర్శించనున్నారు. అయితే జిల్లాలోని అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 80 స్క్రీన్ల లో గాంధీ సినిమాలను ప్రదర్శించనున్నారు.
కాగా అధికారులు ఆయా బడులకు సమీపంలో ఉన్న పట్టణంలోని థియేటర్లను ఎంపిక చేశారు. గచ్చిబౌలిలోని ఏఎంబీ, పీవీఆర్ తదితర ఏడు స్క్రీన్లను పట్టణ ప్రాంతంలో.. షాద్నగర్ తదితర పట్టణాల్లో ఎనిమిది స్క్రీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిక చేశారు. అయితే రోజుకు 31,249 మంది విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ బస్సుల్లో థియేటర్లకు తరలించనున్నారు. విద్యార్థులతోపాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కూడా వెంట రానున్నారు. మరోవైపు థియేటర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఒక్కో థియేటర్ వద్ద ముగ్గురు ఇన్చార్జిలను నియమించారు. వారిలో ఒక గెజిటెడ్ అధికారితోపాటు మరో ఇద్దరు ఉంటారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆరు నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మహాత్మాగాంధీ గురించి తెలిసే లా నేటి నుంచి 21వ తేదీ వరకు ఆయన చిత్రాలను ప్రదర్శించనున్నాం. ఇప్పటికే థియేటర్ల ఎంపిక కూడా పూర్తయ్యింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా థియేటర్ల వద్ద అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశాం.
-సుశీందర్రావు, జిల్లా విద్యాశాఖ అధికారి