కేశంపేట, ఆగస్టు 2 : ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రానున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని భైర్ఖాన్పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు రాయికంటి కృష్ణయ్య, ప్రభాకర్, సాక లి రాజు, మంగళి లక్ష్మయ్య, వెలిజర్ల లక్ష్మయ్య, నరేశ్‌లు మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముందు ప్రతిపక్షాల ఆటలు సాగవన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చా రు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తిం పు ఉంటుందన్నారు. అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, టీఆర్ఎవ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాదగిరిరావు, ద్రోణాచారి, గ్రామ అధ్యక్షుడు యాదగిరియాదవ్, బాబుయాదవ్, యాదయ్యయాదవ్, శివకుమార్‌యాదవ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
ఘనంగా గరుత్మంతుడికి పూజలు
షాద్‌నగర్ : గరుడ పంచమిని పురస్కరించుకొని షాద్‌నగర్ పట్టణంలోని జానంపేట వేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగంణంలో గరుత్మంతుడి విగ్రహం వద్ద మంగళవారం పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు పూజ లు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, కౌన్సిలర్లు అంతయ్య, నర్సింహ, ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్ పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
రైతు కాలనీకి చెందిన సయ్యద్ ఆసిఫ్ అలీకి రూ. 1.5 లక్షలు, ఎన్జీవో కాలనీకి చెందిన ఎండీ మత్తీన్కు రూ. 27 వేలు, నేతాజీ కాలనీకి చెందిన ఎం. వీరేశానికకి రూ.36 వేలు, విజయ్నరగ్ కాలనీకి చెందిన రామస్వామికి రూ. 17 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.