నందిగామ, జూలై 23 : కొత్తూరు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య ఆధ్వర్యంలో కొత్తూరులో రూ. 2 కోట్లతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ యార్డు, రూ.కోటితో నిర్మించనున్న వైకుంఠధామం, సీసీ రోడ్డు పనులకు శనివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా అమలవుతున్నదని, ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మంచి ఫలితానిస్తున్నాయన్నారు. గ్రామాలు, పట్టణాల్లో సమస్యలు పరిష్కారమై పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నయన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తున్నదన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి పనులకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వీరేందర్, వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు కోస్గి శ్రీను, సోమ్లానాయక్, నర్సింహులుగౌడ్, మాధవి, హేమ, జయ మ్మ, ప్రసన్నలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణా యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, బాతుక లక్ష్మయ్య, దేవేందర్‌యాదవ్, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఆసరా.. సీఎం సహాయ నిధి షాద్‌నగర్ : పేద ప్రజలకు అత్యవసర సమయాల్లో సీఎం సహాయ నిధి ఆసరాగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు.
ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామంలోని తన నివాసంలో పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కేశంపేటకు చెందిన ఫాతిమాబేగానికి రూ. 60 వేలు, దత్తాయిపల్లి గ్రామానికి చెందిన సత్యయ్యకు రూ. 18.5 వేలు, సంగెం గ్రామానికి చెందిన ఫరీద్ఖాన్కు రూ. 51 వేలు, దేవునిగుడి తండాకు చెందిన లీలకు రూ. 13 వేలు, అల్వాల గ్రామానికి చెందిన నర్సింహ్మకు రూ. 27 వేల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.