పరిగి, జూలై 18: పరిగి పట్టణంలో సోమవారం పోచమ్మ బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మున్నూరువాడ, బెస్తవాడ, ఊరడమ్మ ఆలయం, బహార్‌పేట్ మీదుగా పోచమ్మ ఆలయం వరకు మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పరిగి జడ్పీటీసీ హరిప్రియ-ప్రవీణ్‌కుమార్ రెడ్డి దంపతులు, మున్సిపల్ చైర్మన్ అశోక్ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ జడ్పీటీసీ బాబ య్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, కౌన్సిలర్ వెంకటేశ్, నాగేశ్వర్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వికారాబాద్ పట్టణంలో..
వికారాబాద్, జూలై 18: వికారాబాద్ పట్టణంలో బోనాల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నా రు. సోమవారం పట్టణంలోని రామయ్యగూడ, ఎన్నెపల్లి తదితర కాలనీల్లోని ఆషాఢ మాసాన్ని పురస్క రించుకుని పోచమ్మతల్లికి బోనాలు తీశారు. ఉదయం నుంచే స్థానికులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మ వారికి సమర్పించి.. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు అలరించాయి. కాలనీల కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో ఆలయానికెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, కృష్ణ, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
తిమ్మారెడ్డిగూడ గ్రామంలో..
షాబాద్, జూలై 18: మండలంలోని తిమ్మారెడ్డిగూడలో సోమవారం బోనా ల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే గ్రామస్తులు పోచమ్మ, మైసమ్మ అమ్మవార్ల ఆలయాలకెళ్లి ప్రత్యేక పూజ లు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం సమయంలో మహిళలు బోనాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయాలకెళ్లి నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేసి సల్లంగా చూడాలని వేడుకున్నారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, యువకుల కేరింతలతో గ్రామం మార్మోగింది. కార్యక్రమంలో సర్పంచ్ శకుంతల, ఎంపీటీసీ సునీత, పీఏసీఏస్ వైస్ చైర్మన్ మల్లేశ్, మాజీ ఎంపీటీసీ పాం డు, రామస్వామి, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.