పరిగి, జూలై 8: కేంద్ర ప్రభుత్వం చమురు, వంటగ్యాస్ ధరలను అడ్డగోలుగా పెంచడంపై ఉమ్మడి జిల్లా ప్రజలు భగ్గుమన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి తల్లడిల్లుతుంటే.. మరోసారి వంటగ్యాస్ ధరలు పెంచడంపై మండిపడ్డారు. ‘ఇక ధరల దాడి చాలయ్య మోదీ.. చంపకయ్య మోదీ’ అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. పేదలను దోచి పెద్దలకు పెడుతున్న కేంద్రానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అనేది ఒట్టి మాటలేనని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను పెం చడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పరిగిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఎనిమిదేండ్ల పాలనలో వంట గ్యాస్ ధర 170 శాతం పెరిగిందన్నారు. 2014లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.410 ఉండగా ప్రస్తుతం రూ.1105కు పెరిగిందని విమర్శించారు.
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుతో పేదలపై మోయలేని భారం పడుతున్నదన్నారు. వీటి ప్రభావంతో నిత్యావసర సరుకుల ధరలు సైతం పెరిగి ప్రజల జీవ నం మరింత భారంగా మారిందన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసం పని చేస్తున్నదని, పేదల బాగును మరిచిపో యిందన్నారు. పెంచిన ధరలను తగ్గించే వరకూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పరిగిలోని కొడంగల్ క్రాస్‌రోడ్డులో గ్యాస్ సిలిండర్లతో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పరిగి ఎంపీపీ కర ణం అరవిందరావు, పరిగి, పూడూరు మండలాల జడ్పీటీసీలు బి.హరిప్రియ, మలిపెద్ది మేఘమాల, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆంజనేయు లు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పరిగి, దోమ మండలాల వైస్ ఎంపీపీలు సత్యనారాయణ, మల్లేశం, ఎంపీటీ ల ఫోరం మండలాధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌వర్దన్‌రెడ్డి, భా స్కర్, నార్మాక్స్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.