అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 8 : ప్రజలు ఫిల్టర్ నీరు తాగకుండా మిషన్ భగీరథ నీటినే తాగాలని మిషన్‌భగీరథ డీఈ రాజు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీరు తాగడం వల్ల కలిగే ఉపయోగాలపై మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తుందన్నారు. బండరావిరాల సర్పంచ్ కవాడి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మిషన్‌భగీరథ నీటిపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
మిషన్ భగీరథ, ఫిల్టర్ నీటిని సేకరించి పరీక్షలు చేసి తేడాలను వివరించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు మిషన్‌భగీరథ నీటిని తాగి ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ పావని, ఉపసర్పంచ్ నెమురగోముల స్వామి, వార్డుసభ్యులు పల్లపు పద్మ, సామల శంకర్‌రెడ్డి, కొత్త అరుణ్‌కుమార్‌గౌడ్, శివశంకర్, సంతోష, హేమ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథ తాగునీటిపై అవగాహన
కడ్తాల, జూలై 8: మండల పరిధిలోని మక్తమాదారం గ్రామంలో మిషన్ భగీరథ తాగునీటిపై అధికారులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సులోచన అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులు, విద్యార్థులకు అవగాన కల్పించారు. ప్రభుత్వం ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా శుద్ధనీటిని అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మంజుల, ఉపసర్పంచ్ గణేష్, డీఈఈ మోహన్‌రెడ్డి, యాదగిరి, శ్రీను, రాజు, కృష్నయ్య పాల్గొన్నారు.