పరిగి, జూలై 8: జిల్లాలోని మండల స్టాక్ పాయింట్ నుంచి అంగన్వాడీ కేంద్రం వరకు నేరుగా బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమారి తెలిపారు. ఇంతకుముందు అంగన్వాడీ టీచర్లు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం సేకరించేవారని, ఇకనుంచి స్టాక్పాయిం ట్ నుంచి నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా జరుగుతుం దన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డీఆర్వో విజయకుమారి మాట్లాడుతూ ప్రతి మండలానికి ఒక పర్యవేక్షకుడిని ఏర్పాటుచేసి బయో మెట్రిక్ ద్వారా 50 కిలోల బస్తాలను పౌర సరఫరాల శాఖ ద్వారా అందజే స్తారన్నారు. ప్రతి సెక్టార్ సూపర్వైజర్ మండల స్టాక్ పాయింట్‌కు వెళ్లి ఈ పాస్ మిషన్‌లో వేలిముద్రలు వేసి బియ్యం తీసుకోవడానికి ట్రక్ షీట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
స్టేజ్ 2 కాంట్రాక్టర్ ట్రక్ షీట్ ద్వారా సెక్టార్ లోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా అయ్యేలా చూడా ల్సిన బాధ్యత సూపర్వైజర్పై ఉంటుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల వద్ద టీచర్లు ఎలాంటి హమాలీ, ఇతర చెల్లింపులు చేయాల్సిన అవసరం లేద న్నారు. అంగన్వాడీ కేంద్రానికి బియ్యం సరఫరాలో ఏమైనా సమస్య లుంటే డీడబ్ల్యూవో కు తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీడబ్ల్యూవో లలితకుమారి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ విమల, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.