మొయినాబాద్, జూన్ 20 : ప్రజాసంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజనశాల నిర్మాణానికి స్వరూపతో కలిసి శంకుస్థాపన చేశారు. సురంగల్ గ్రామంలో సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాన్ని సర్పంచ్ గడ్డం లావణ్యతో కలిసి ప్రారంభించారు. ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌తో కలిసి రెండు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తూ పచ్చని వాతావరణం కల్పించేలా కృషి చేస్తుందన్నారు.
కార్యక్రమంలో ఎంపీడీవో సంధ్య, ఏవో రాగమ్మ, ఎంఈవో వెంకటయ్య, కార్యదర్శులు నర్సింహులు, వెంకటేశ్, ఉపసర్పంచ్లు యాదమ్మ, సుధాకర్‌రెడ్డి, వార్డు సభ్యులు సుప్రియ, జయప్రద, భాస్కర్, ఇంద్రమ్మ, విక్రంరెడ్డి, మాధవి, ఎండీ షఫీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి నర్సింహాగౌడ్, ఉపాధ్యక్షుడు జయంత్, రావూఫ్, సుధాకర్‌యాదవ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ రితీశ్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజు, టీఆర్ఎస్ నాయకుడు అంజిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లేశ్, మాజీ ఉపసర్పంచ్ ఆండ్రూ, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు పరమేశ్, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండీ ముజ్జు, టీఆర్ఎస్ నాయకులు రవీందర్, మహేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, బాల్‌రాజ్, సద్దాంహుస్సేన్, సునీల్, కిరణ్ పాల్గొన్నారు.
రైతుల అభ్యున్నతికి పెద్దపీట
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలో ఆయన రైతులకు ప్రభుత్వం అందించిన సబ్సిడీ విత్తనాలను ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు ద్వారా బీడు భూములు కూడా సాగులోకి వచ్చాయని అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాగమ్మ, ఎంపీడీవో సంధ్యం, చిలుకూరు సర్పంచ్ స్వరూప, మాజీ సర్పంచ్ ఎస్.మల్లేశ్, మాజీ ఉపసర్పంచ్ ఆండ్రూ, నాయకులు పాల్గొన్నారు.