షాబాద్, జూన్ 16: జీవాల ఆరోగ్యం పట్ల కాపరులు జాగ్రత్తలు పాటించాలని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, హైతాబాద్ సర్పంచ్ కావలి మల్లేశ్ అన్నారు. గురువారం హైతాబాద్ గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గొర్రెలు, మేకలకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నట్టల నివారణ టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, గొర్రెల కాపరులు తదితరులు పాల్గొన్నారు.
వివిధ గ్రామాల్లో..
కొత్తూరు రూరల్ : సిద్ధాపూర్, పుల్చర్లకుంటతండా, ఏనుగులమడుగుతండా గ్రామాల్లో మండల పశువైద్యాధికారి డాక్టర్ స్ఫూర్తి ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. మొత్తం 1075 గొర్రెలు, 718మేకలకు నట్టల నివారణ మందులను వేసినట్లు డాక్టర్ స్ఫూర్తి తెలిపారు. కార్యక్రమంలో సిద్ధాపూర్ సర్పంచ్ తులసమ్మ, గొర్రె కాపరుల సంఘం అధ్యక్షుడు పర్వతాలు, పశువైద్య సిబ్బంది మల్లయ్య, పద్మ, కృష్ణ, రవి, రాజు, గొర్రెకాపరులు పాల్గొన్నారు.
జీవాలకు మందులు తప్పనిసరి..
వర్షాలు కురుస్తున్నందున గొర్రెలు, మేకలకు సీజనల్గా వచ్చే వ్యాధులను నివారించేందుకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న నట్టల నివారణ టీకాలను వేయించాలని సర్పంచ్ శివరాల జ్యోతీరాజు అన్నారు. మండల పరిధిలోని ముకునూరు గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేశారు.