రంగారెడ్డి, జూన్ 15, (నమస్తే తెలంగాణ) : జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలోని ఆమన్‌గల్లు, కందుకూరు, కేశంపేట మండలాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. అయితే వర్షానికి జిల్లాలోని పలు మండలాల్లోని రోడ్లన్నీ జలమయం కావడంతోపాటు చెరువుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది.
జిల్లాలోని ఆయా మండలాల్లో నమోదైన వర్షపాతానికి సంబంధించి, కందుకూరు మండలంలో 122.7 మి.మీటర్లు, ఆమన్‌గల్లు మండలంలో 121.5 మి.మీటర్లు, కేశంపేట మండలంలో 89.9 మి.మీటర్లు, కొత్తూరు మండలంలో 70 మి.మీటర్లు, ఇబ్రహీంపట్నం మండలంలో 66.9 మి.మీటర్లు, కడ్తాల్ మండలంలో 62.2 మి.మీటర్లు, యాచారం మండలంలో 55.3 మి.మీటర్లు, తలకొండపల్లి మండలంలో 47.1 మి.మీటర్లు, మాడ్గులలో 33.9 మి.మీటర్లు, మహేశ్వరంలో 32.1 మి.మీటర్లు, షాబాద్ మండలంలో 21.5 మి.మీటర్లు, ఫరూఖ్‌నగర్‌లో 23.7 మి.మీటర్లు, శంకర్పల్లి మండలంలో 26.2 మి.మీటర్లు, నందిగామలో 11.8 మి.మీటర్లు, కొందుర్గులో 6.4 మి.మీటర్లు, చౌదరిగూడెంలో 6 మి.మీటర్లు, శంషాబాద్‌లో 12.7 మి.మీటర్లు, చేవెళ్లలో 4.9 మి.మీటర్లు, మంచాలలో 8.2 మి.మీటర్లు, సరూర్‌నగర్ 6.9 మి.మీటర్లు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 2.7 మి.మీటర్లు, బాలాపూర్‌లో 4.2 మి.మీటర్లు, రాజేంద్రనగర్ 1.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.