యాలాల, జూన్ 15 : ప్రజా రక్షణతో పాటు నేర నియంత్రణలో మూడో నేత్రంగా సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఐదు గ్రామాల్లో 50 సీసీ కెమెరాలను తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్, రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐ అరవింద్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో నిఘా పటిష్టం కావడమే కాకుండా నిందితులను త్వరగా పట్టుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ప్రజలు పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పోలీసులకు ప్రజలు సహకరించాలని, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు, చోరీలు, ప్రమాదాలు జరిగితే వెంటనే తెలియజేయాలన్నారు. సీసీ కెమెరాలను ప్రతి గ్రామంలో ప్రజలు, నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర గుప్తా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మండల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, ఆకుల బస్వరాజ్, మల్లారెడ్డి, అక్బర్ బాబా, వడ్డె రాములు, శేఖర్ పటేల్, లాలప్ప, కృష్ణ, సర్పంచ్‌లు ఆకుల శివకుమార్, వెంకట్ రెడ్డి, బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.