యాచారం, జూన్ 15 : మండల కేంద్రంలోని బృహత్ పల్లె ప్రకృతివనాన్ని ఎంపీడీవో విజయలక్ష్మి బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. బృహత్ పల్లె ప్రకృతివనంలో ఏపుగా పెరిగిన మొక్కలను ఆమె స్వయంగా పరిశీలించారు. ఉపాధి కూలీలతో నూతనంగా మరిన్ని మొక్కలను నాటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బృహత్ పల్లె ప్రకృతివనం మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహించొద్దన్నారు. మండలంలో మరిన్ని బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి సందీప్, ఈసీ శివశంకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి తిరుపతయ్య ఉన్నారు.