కడ్తాల్, జూన్ 15 : ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మండల ప్రత్యేకాధికారి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని గడ్డమీదితండా, గోవిందాయిపల్లి తండా, మైసిగండి గ్రామాల్లో ఎంపీడీవో రామకృష్ణతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించి, పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, డంపింగ్ యార్డులు, పాఠశాలలను ఆయన సందర్శించారు. తడి, పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పంచాయతీ సిబ్బందితో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగింపజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, పాండునాయక్, రాములునాయక్, ఉప సర్పంచ్ ఎల్లాగౌడ్, ఏంపీవో మధుసూదనాచారి, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.