విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని షాబాద్ ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, ఎంపీడీవో అనురాధ అన్నారు. బుధవారం చందనవెళ్లి ప్రాథమిక పాఠశాలలో బడి బాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు.
ఎంపీపీ ప్రశాంతిరెడ్డి, ఎంపీడీవో అనురాధ
షాబాద్, జూన్ 15 : విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని షాబాద్ ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, ఎంపీడీవో అనురాధ అన్నారు. బుధవారం చందనవెళ్లి ప్రాథమిక పాఠశాలలో బడి బాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం దాత బొంతపల్లి విద్యాసాగర్ పేద విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించనున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడులకే పంపించాలని సూచించారు. పేద విద్యార్థులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు.