తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయేలా 80 వేల పైచిలుకు ఉద్యోగాల నియామకాలకు విడుతల వారీగా నోటిఫికేషన్లను వెలువరిస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేటు కోచింగ్‌లకు వెళ్లలేని పేద అభ్యర్థుల కోసం మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్లనూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిపుణ పేరిట ప్రత్యేక సంచికను వెలువడుతున్నది. అంతేకాకుండా నేడు పరిగిలోని కొప్పుల శారద గార్డెన్-2లో అవగాహన సదస్సు నిర్వహించనున్నది. ఈ సదస్సులో పోటీ పరీక్షలపై నిపుణులు అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఉద్యోగార్థుల్లో నెలకొన్న సందేహాలను సైతం నివృత్తి చేయనున్నారు. అభ్యర్థులకు ఉపయోగపడేలా పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఎలా చదువాలి… ఎలాంటి మెటీరియల్ ఎంచుకోవాలి.. నోటిఫికేషన్ విధానంపై అవగాహన కల్పించనున్నారు.
పరిగి, జూన్ 13: సీఎం కేసీఆర్ ప్రభుత్వం చరిత్రలోనే మొదటిసారిగా సుమారు 80వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి విడుతల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పిలుపుతో ఎమ్మెల్యేలు ఉద్యోగార్థుల కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నా రు. శిక్షణా తరగతులకు హాజరయ్యే వారికి ఉచితంగా భోజనం, కోచింగ్‌తోపాటు మెటీరియల్ ను కూడా అందిస్తున్నారు. అలాగే ప్రభుత్వపరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలోనూ ఉచితంగా కోచింగ్ సెంటర్లు కొనసాగుతున్నాయి. కాగా ఒకేసారి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతున్న నేపథ్యంలో పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి అనే భయం అభ్యర్థుల్లో నెలకొని ఉం టుంది.
ఒత్తిడిని ఎలా జయించాలి, గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అనే సందేహాలు ఉద్యోగార్థు ల మదిలో మెదులుతుంటాయి. ఇలాంటి వా టిని ఛేదించి, విజయం సాధించేలా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. పరిగి ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సౌజన్యంతో పరిగి పట్టణంలోని కొప్పుల శారద గార్డెన్-2లో మంగళవారం ఉదయం 10గంటలకు అవగాహన సదస్సును నిర్వహిస్తున్నది. దీనికి సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ మల్లవరపు బాలలత, వేప అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప వక్తలుగా హాజరు కానున్నా రు. ఆత్మీయ అతిథులుగా పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, వికారాబాద్ కలెక్టర్ నిఖిల హాజరవుతారు. ఉద్యోగార్థుల్లో నెలకొన్న భయాలు, అనుమానాలను తొలగించి పోటీ పరీక్షలకు సన్నద్ధ్దమయ్యేలా దిశానిర్దేశం చేయనున్నారు.
ఉద్యోగార్థుల కోసం నిపుణ..
వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం నమస్తే తెలంగాణ దినపత్రిక నిపుణ పేరి ట ప్రత్యేక సంచికను అందిస్తున్నది. ఉద్యోగార్థులకు పోటీ పరీక్షల్లో ఉపయోగపడేలా నిపుణులతో రూపొందించిన నాలుగు పేజీలు(తెలుగు, ఇంగ్లిషు మాధ్యమాల్లో) 2022 ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రతిరోజూ పాఠకులకు అందిస్తున్న ది. ప్రతి బుధవారం ఎనిమిది పేజీల ప్రత్యేక అనుబంధాన్ని కూడా వెలువరిస్తున్నది.
ఉద్యోగార్థులకు అవగాహన కోసమే ..
పోటీ పరీక్షలకు సిద్ధ్దమవుతున్న అభ్యర్థులకు అవగాహన కల్పించి, సందేహాల నివృత్తి కోసమే ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో మంగళవారం పరిగిలో అవగాహన సదస్సును నిర్వహిస్తు న్నాం. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.
-కొప్పుల మహేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి