కరీంనగర్ కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 17 : జేఈఈ – మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు అత్యధిక పర్సంటైళ్లతో జయకేతనం ఎగురవేశారని విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్‌రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మైత్రేయ 99.94, కే రాజేశ్వరి 99.77, పీ హరీశ్ 99.74, ఎం కారుణ్య 99.25, హంస 99.14, గోపాలకృష్ణ 99.08 సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చారని తెలిపారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒకే బ్రాంచ్ నుంచి 99 పర్సంటైల్ ఆపై ఆరుగురు, 98 పర్సంటైల్ ఆపై ఐదుగురు, 97 పర్సంటైల్ ఆపై 10 మంది విద్యార్థులు సాధించడం సంతోషించదగిన విషయమని చెప్పారు. పటిష్టమైన ప్రణాళిక, అద్భుతమైన బోధన, నిరంతర పర్యవేక్షణ, పకడ్బందీగా పరీక్షల నిర్వహణ, విద్యార్థుల కౌన్సెలింగ్ ద్వారా అద్భుత ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందాన్ని అభినందించారు.