ఇబ్రహీంపట్నం, జూన్ 12 : ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని, ఎన్నికల ముందు వారు వేసే వేషాలను ప్రజలు నమ్మరని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు గుంపులుగా ప్రజల ముందుకు వచ్చి డ్రామాలాడటం వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ చేరాయని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ వెంటే అడుగులేస్తున్నారన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, సత్తువెంకటరమణారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, నోముల కృష్ణ, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్లు ఆకుల యాదగిరి, కళమ్మ, వైస్ ఎంంపీపీ వెంకటప్రతాప్‌రెడ్డి, మండ అధ్యక్షులు బుగ్గరాములు, రమేశ్‌గౌడ్, కిషన్‌గౌడ్, చీరాల రమేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీరప్ప ఉత్సవాలకు ఆహ్వానం
ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 12 : మండల పరిధిలోని కప్పాడు గ్రామంలో ఈ నెల 20వ తేదీ నుంచి బీరప్పస్వామి పండుగ జరుగనుంది. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వానం అందజేశారు. కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో నిట్టు జగదీశ్వర్,కుర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు.