పెద్దేముల్, జూన్ 10: నాటుసారా తయారు చేసినా, విక్రయించినా , అం దుకు ప్రోత్సహించిన వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని తాం డూరు ఎక్సైజ్ ఎస్హెచ్వో చిన్నరాములు అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని పాషాపూర్, రాంసింగ్, బాయిమీది తండాల్లో వికారాబాద్ జిల్లా డీపీఈవో నవీన్చంద్ర ఆధ్వర్యంలో, రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఏపీఈఎస్ జె, జీవన్ కిరణ్ పర్యవేక్షణలో సిబ్బందితో కలిసి పలుచోట్ల ఆయా గ్రా మా ల్లో మెరుపుదాడులు చేస్తూ సోదాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మండల పరిధిలోని పాషాపూర్, రాంసింగ్, బాయిమీది తండాల్లో తెలంగాణ ప్రభుత్వం గుడుంబా నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమొషనర్ ఆదేశాలమేరకు జిల్లా ఎక్సైజ్ సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సోదాల్లో మొత్తం 51 లీటర్ల నాటుసారా, 570 లీటర్ల బెల్లం పానకం లభ్యం అయినట్లు తెలిపారు. కాగా ఈ దాడులకు సంబంధింఛఙ మొత్తం 11 కేసులను నమోదు చేయగా అందులో ఆయా గ్రామాలకు చెం దిన మొత్తం 12 మంది భాగస్వాములుగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అం దులో మొత్తం ఆరుగురిని రిమాండ్కు కూడా పంపించనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ 2 ఎక్సైజ్ టీంలు, డీటీఎఫ్ వికారాబాద్ జిల్లాతోపాటు, జిల్లాలోని 5 ఎక్సైజ్ పోలీసుస్టేషన్ల పోలీసు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.