సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): మైనర్ డ్రైవింగ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫోకస్ పెట్టారు. గత నాలుగేండ్లలో 45 మంది మైనర్లు మృతి చెందారు. ఈ డాటాను సేకరించిన ట్రాఫిక్ పోలీసులు, మైనర్ రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో తగ్గించే లక్ష్యంతో ఎన్ఫోర్స్మెంట్ను పటిష్టం చేశారు. గడిచిన నెలన్నర రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు 150 నుంచి 175 కేసులు నమోదు చేస్తున్నారు. మోటారు వాహనాల చట్టం 180, 181 ప్రకారం వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వాహన యజమానిపై కూడా కోర్టు విచారణ ఉంటుంది. ఇందులో భాగంగా వాహనం డ్రైవింగ్ చేసిన మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేస్తున్నారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తున్నారు.
అదుపులో ఉండకపోవడం..
టీనేజీ వయస్సులోని పిల్లలు వాహనాలపై వేగంగా దూసుకెళ్తుంటారు. ఈ వేగంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు కేసులను అధ్యయనం చేసిన పోలీసులు.. మైనర్లకు వాహనాలు ఇవ్వొదంటూ తల్లిదండ్రులకు చెబుతున్నారు. అయినా చాలా మందిలో మార్పు రావడంలేదు. మైనర్లకు వాహనాలు ఇస్తున్నారు. పెద్దలు వ్యవహరిస్తున్న ఈ తీరు వల్లే మైనర్లను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. దీంతో మైనర్ డ్రైవింగ్‌కు ప్రోత్సహిస్తున్న వారిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మైనర్ డ్రైవింగ్ చేస్తే.. అతడితో పాటు వాహన యజమాని కూడా నేరం చేసినట్టు అవుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. మైనర్‌తో పాటు వాహన యజమానికి కూడా తొలుత కౌన్సిలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత ఆ ఇద్దర్ని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. వాహనం ఎవరి పేరుతో ఉన్నా.. వారిపై చర్యలు ఉంటాయని చెబుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
స్పెషల్ డ్రైవ్‌లో నమోదైన కేసులు – 2082
చార్జిషీట్ వేసినవి – 1932
శిక్షలు – జరిమానాలు, ఒకటి రెండు రోజుల జైలు, సామాజిక కార్యక్రమాలు